తిరువూరు నియోజకవర్గం పరిధిలో గల విస్సన్నపేట మండలం కొండ పర్వలో కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రామకృష్ణ అన్నారు. విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామానికి చెందిన నాగరాజు, నూజివీడు మండలంలోని సుంకోల్లు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావుల వద్ద కోడి కత్తులు ఉన్నట్లు సమాచారం రావడంతో వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ శుక్రవారం తెలిపారు.