78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో మెరుగైన పనితీరు కనబరచిన 16 మంది జిల్లా అధికారులకు, 242 వివిధ శాఖల ఉద్యోగులకు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్ధసారధి ప్రశంసా పత్రాలను అందజేశారు. వీరితో పాటు ఐదుగురు పోలీస్ సిబ్బందికి పోలీస్ సేవా పతకాలను బహూకరించారు. వివిధ స్వచ్ఛంధ సేవా సంస్ధలకు కూడా ప్రశంసా పత్రాలను అందజేశారు.