ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ప్రజలకిచ్చిన ప్రతీ హామీని నెరవేర్చడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తోందని, ప్రజా ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలని ఆయన కోరారు. ఏలూరు 42వ డివిజన్ కొత్తపేట నూకాలమ్మ గుడివద్ద ఆదివారం సాయంత్రం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.