ఇటీవల కురిసిన అధిక వర్షాల ప్రభావంతో కాళీపట్నం పడమరలో ఉన్న ఓరియంటల్ హై స్కూల్ జలమయం అయింది.గురువారం గ్రామ సర్పంచ్ కవురు సావిత్రి ఆదినారాయణ, పంచాయతీ కార్యదర్శి ఎం సత్యనారాయణ పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఇంజన్ ఏర్పాటు చేసి విద్యార్థుల ఇబ్బందులు పడకుండా పాఠశాల ఆవరణలోని నీటిని బయటకు తోడారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ బాలాజీ వీఆర్వో డేవిడ్ రాజు,పంచాయతీ సిబ్బంది పాలకవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు.