పవన్ కళ్యాణ్ కు సమస్యలను వివరించిన నరసాపురం ఎమ్మెల్యే నాయకర్

62చూసినవారు
పవన్ కళ్యాణ్ కు సమస్యలను వివరించిన నరసాపురం ఎమ్మెల్యే నాయకర్
మంగళగిరిలోని జనసేన పార్టీ జాతీయ కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను నరసాపురం ఎమ్మేల్యే బొమ్మిడి నాయకర్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. నరసాపురం నియోజకవర్గంలోని దీర్ఘకాలిక సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. పట్టణంలో డంపింగ్ యార్డ్ సమస్యను వివరించారు. పేరుపాలెం బీచ్ లో మేరైన్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని కోరారు. బొమ్మిడి సునీల్ నాయకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్