తూర్పు పాలెం, మినిమించిలి పాడు, పోడూరు గ్రామాలలో ధాన్యం ఆరబెట్టిన కళ్లలా వద్ద తాహసిల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్ బుధవారం స్వయంగా వెళ్లి, రైతులతో మాట్లాడారు. తుఫాను ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులు ధాన్యాలను త్వరగా మిల్లులకు తరలించాలని, ఆరని ధాన్యాలను సురక్షితంగా దాచుకోవాలని సూచించారు. వర్షాలు పడే అవకాశం ఉండటంతో, రైతులు తమ ధాన్యాన్ని సేవా కేంద్రముల ద్వారా ప్రభుత్వమునకు అమ్మి మద్దతు ధర పొందాలని అన్నారు.