నరసాపురం మున్సిపల్ హెడ్ వాటర్ వర్క్స్ విభాగంలో వాటర్ ఫిల్టర్ బెడ్ వద్ద కొత్త వాల్వ్ ఏర్పాటు చేయనున్నారని కమిషనర్ ఎం. అంజయ్య తెలిపారు. ఈ పనుల కారణంగా బుధవారం సాయంత్రం నీటి సరఫరా ఉండదని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం ఉదయం యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందన్నారు. ప్రజలు మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు.