బాలిక అదృశ్యమైన సంఘటనపై మంగళవారం కేసు నమోదు చేశామని నరసాపురం టౌన్ జయలక్ష్మి తెలిపారు. పట్టణానికి చెందిన
బాలిక (15) ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 15న గౌరీపట్నం మేరీమాత దర్శనానికి వెళ్తున్నానని ఇంటి వద్ద చెప్పి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. దీనిపై ఆ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.