సిపిఎంకు రుద్రరాజు సత్యనారాయణ రాజు (ఆర్ఎస్) లేని లోటు తీరలేనని పలువురు నాయకులు అన్నారు. మంగళవారం మొగల్తూరు లోని సిపిఎం కార్యాలయంలో ఆర్ఎస్ చిత్రపటానికి పూలమాల వేసి విప్లవ జోహార్లు అర్పించారు. బడుగు బలహీన వర్గాల పీడిత ప్రజల కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఆయన తుది శ్వాస విడిచే వరకు పార్టీకి సేవలు అందించారని అన్నారు.