పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా గురువారం పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం ఆర్యపేట, మేడపాడు గ్రామాల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టరు నిమ్మల రామానాయుడు పలు శంకుస్థాపనలు నిర్వహించారు. అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించి, శిలాఫలకాలను ఆవిష్కరించారు. మామిడిశెట్టి పెద్దిరాజు, పీతల శ్రీను, పెన్మెత్స రామభద్రారాజు, టిడిపి జనసేన బిజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.