కర్నూల్ లో ఉల్లి మార్కెట్ ను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి, కర్నూల్ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ ఉల్లి రైతుకు ఒక్క రూపాయి కూడా నష్టం జరగకూడదన్నారు. వినియోగ దారుడుకి మేలు జరిగేలా ఎన్డీయే కూటమి పని చేస్తుందన్నారు. ఈనామ్ పని చేయకపోతే వెంటనే ఆఫ్ లైన్లో నమోదు చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు.