యలమంచిలి మండలం బాడవ గ్రామంలో ఆదివారం జనసేన రాష్ట్ర నాయకుడు గవర ఉదయ్ శ్రీనివాస్, సినీ నిర్మాత(బన్నీ వాసు) పర్యటించారు. గ్రామ సర్పంచ్ సర్పంచ్ రాయి సత్యనారాయణ సొంత సొమ్ముతో నిర్మించిన స్మశాన వాటికను పరిశీలించారు. అనంతరం జనసేన నాయకులతో కలిసి గ్రామ సమస్యలపై చర్చించారు. ఆయా సమస్యలను మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం అయ్యేలా చేస్తానని వారికి హామీ ఇచ్చారు.