ఏలూరు జిల్లాలో భారీవర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో 207 ఇళ్లు దెబ్బతిన్నట్టు సమాచారాన్ని నమోదు చేశారని కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. వరద నష్టాలు యాప్లో నమోదుపై సంబంధిత అధికారులతో ఆదివారం కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. జాబితాను కలెక్టరేట్లో ప్రదర్శించారని భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు నష్టపోయిన బాధితులకు ఈ నెల 25న పరిహారం అందజేస్తామన్నారు.