పెంటపాడు మండలం బి. కొండేపాడు గ్రామ ఇలవేల్పు కనకదుర్గమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈనెల 17 నుంచి 28 వరకు జరుగుతాయని ఆలయ ఈవో శోభనాద్రి తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ పునఃనిర్మాణం జరుగుతోందన్నారు. 17 రాత్రి అమ్మవారి జాతర, 22న అంకురార్పణ, 23న అమ్మవారి కల్యాణ మహోత్సవం, 24న అమ్మవారి దివ్యరథోత్సవం, తీర్థం, 26న గ్రామ బలిహరణ, 28న త్రిశూల స్నానం కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.