తాడేపల్లిగూడెం పట్టణంలోని జువ్వలపాలెం, 15వ వార్డులో శుక్రవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా సిసి రహదారి నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడితే రూ.20 లక్షల వ్యయంతో ఈ పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జ్ వలవల బాబ్జి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.