అత్తిలి నుండి తణుకు పట్టణానికి వెళ్లే ప్రధానరహదారి పెద్ద పెద్దగుంతలు ఉండడతో.. మూడురోజుల నుండి కురుస్తున్న వర్షాలకు రహదారి నీటితో నిండి చెరువుల మారింది. ప్రయాణికులు అత్తిలి నుండి తణుకు జిల్లా కేంద్ర హాస్పిటల్ కి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను వేంటనే పరిష్కరించాలని అత్తిలి గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు.