సెప్టెంబర్ 14న ప. గో. జిల్లాలోని అన్ని కోర్టుల్లో లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు తణుకు 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి. సత్యవతి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజీపడే క్రిమినల్, సివిల్ కేసులు రాజీ చేసుకుంటే కోర్టుకు చెల్లించిన రుసుం తిరిగి తీసుకునే అవకాశం ఉందన్నారు. లోక్అదాలత్ కేసుల రాజీ సలహా, సహాయం కోసం న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ అధికారులను సంప్రదించాలని తెలిపారు.