ఇరగవరం మండలం రేలంగి గ్రామం నుంచి తణుకు వెళ్లే ప్రధాన రహదారి పొడవునా చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. చెత్తను యథేచ్ఛగా రహదారిపై పడేస్తుండడంతో కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వస్తుందని వాహనదారులు, సమీపంలో నివాసం ఉండే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో పందులు, దోమలు పెరిగి వ్యాధుల బారిన పడే అపాయం ఉందని, డంపింగ్ యార్డ్ని మరో ప్రాంతానికి మార్చాలని కోరుతున్నారు.