ఇరగవరం: బెల్టు షాపు నిర్వాహకుడు అరెస్టు
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో ఎక్సైజ్ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గ్రామంలో బెల్టు షాపు నిర్వహిస్తున్న గరగ శ్రీను(47) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 12 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని తణుకు ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ మణికంఠ రెడ్డి తెలిపారు.