గొల్లలకోడేరులో రోడ్డు ప్రమాదం

73చూసినవారు
పాలకోడేరు మండలం గొల్లల కోడేరు సెంటర్లో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువతులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన యువతులు పాలకోడేరుకు చెందిన వారిగా గుర్తించారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భీమవరం ఆస్పత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్