మండల కేంద్రమైన ఉండిలో శుక్రవారం ఎమ్మెల్యే కనుమూరి రఘు రామకృష్ణం రాజు దీపం -2 పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు ఉచిత సిలిండర్లు లబ్దిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్నికల హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు ఉన్నారు.