పాఠశాల వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తో పొంచి ఉన్న ప్రమాదం

80చూసినవారు
పాఠశాల వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తో పొంచి ఉన్న ప్రమాదం
మండల కేంద్రమైన గణపవరం పదో వార్డులోని ప్రాథమిక పాఠశాల వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తో ప్రమాదం పొంచి ఉంది. ట్రాన్స్‌ఫార్మర్
తక్కువ ఎత్తులో ఉండటంతో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ శాఖ వారు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ ఇక్కడ నుంచి తొలగించి మరో చోటకు మార్చాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్