రక్తదాతలను ప్రోత్సహించేలా జిల్లారెడ్ క్రాస్ చైర్మన్ కు సూచన
భీమవరం మండలం రాయలంలో జిల్లా రెడ్ క్రాస్ కార్యాలయాన్ని, కపొనెంటు బ్లడ్ బ్యాంకు కేంద్రాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సహకారంతో సమకూర్చుకున్న 2 కోట్ల విలువ గల యంత్రాలు, పరికరాలు, మౌలిక సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. నేషనల్ సెంట్రల్ డ్రగ్ అధారిటీ న్యూఢిల్లీ నుండి బ్లడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు లైసెన్స్ మంజూరు చేయడమైందని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ తెలిపారు.