ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలీవుడ్ నటుడు గోవిందా (వీడియో)

60చూసినవారు
ప్రమాదవశాత్తూ రివాల్వర్‌ మిస్‌ఫైర్‌ కావడంతో గాయపడి గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, శివసేన నేత గోవిందా శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వీల్‌ఛైర్‌లో ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన ఆయనను పలువురు అభిమానులు పరామర్శించారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తాను క్షేమంగా ఉన్నట్లు గోవిందా బదులిచ్చారు. తాను క్షేమంగా ఉండాలని ప్రార్థించిన వారికి ధన్యవాదాలు చెప్పారు.

సంబంధిత పోస్ట్