గోపాలపురం: జాతీయ రహదారిపై ప్రమాదం
నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణీకుల వివరాలు ప్రకారం ఏలూరు నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న లారీని, ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 9 మందికి స్వల్ప గాయాలయాయి. వీరందరినీ అంబులెన్స్‌లో ఏలూరు, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.