గోపాలపురం - Gopalapuram

రాజీనామా చేసి తప్పు చేశామా?

రాజీనామా చేసి తప్పు చేశామా?

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.5 వేలు వేతనంతో జిల్లాలో 9 వేల 200 మంది వలంటీర్లను నియమించింది. ఐదేళ్లపాటు వీరితో పనులు చేయించుకున్న సర్కార్‌.. ఎన్నికల సమయం రాగానే వారితో రాజీనామాలు చేయించేందుకు అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారు. ఇలా రాజీనామా చేసిన వారినే, మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్లుగా గుర్తించామని మభ్యపెట్టింది. ప్రభుత్వం నుంచి వేతనం ఇస్తూ.. పార్టీకి సేవలందించాలి అనే తీరులో వీరి వ్యవహారం సాగింది. నియోజకవర్గ నేతల ఒత్తిడి, పెట్టిన ఇబ్బందుల కారణంగా జిల్లాలో నాలుగు వేల 200 మంది బలవంతంగా రాజీనామాలు చేశారు. ఇలా రాజీనామాలు చేసిన వీరికి ప్రభుత్వం వేతనం ఇవ్వలేదు. నేతలు కూడా కొద్దిపాటి సొమ్ముతో సరిపెట్టారు. ఒక్కొక్క వలంటీరుకు ఐదు వేలు చొప్పున ఇచ్చి ప్రచారంలో వారి సేవలను వినియోగించుకున్నారు. రాజీనామా చేయని వలంటీర్లకు మాత్రం ప్రభుత్వం గత నెలతోపాటు, ఈ నెల వేతనం కూడా ఇచ్చింది. పది వేలు లబ్ధి పొందారు. ముందు ముందు ప్రభుత్వం వారి సేవలు కొనసాగించనుంది.

ఆదిలాబాద్ జిల్లా