గోపాలపురం: జీతాలు పెంచాలని హమాలీల నిరసన

83చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సివిల్ సప్లైలో పనిచేసే హమాలీల జీతాలు పెంచాలని సీఐటియూ జిల్లా అధ్యక్షులు ఎం. సుందర బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోపాలపురం సివిల్ సప్లై పాయింట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నినాదాలు చేస్తూ మంగళవారం నిరసన తెలిపారు. కార్మికులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందకాలం పూర్తై 11 నెలలైనప్పటికీ స్పందించకపోవడం దారుణమన్నారు. తక్షణమే హమాలీల జీతాలు పెంచాలని అన్నారు.

సంబంధిత పోస్ట్