జంగారెడ్డిగూడెం: వారికి సీఐ హెచ్చరికలు జారీ
దీపావళికి మందుగుండు సామగ్రి ఎవరైనా అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జంగారెడ్డిగూడెం సీఐ కృష్ణ బాబు హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లైసెన్స్ కలిగిన వారు మాత్రమే దీపావళి సామగ్రి కొనుగోలు చేయాలన్నారు. అనధికారికంగా తయారు చేసినా, విక్రయించినా చర్యలు తప్పవన్నారు. అలాగే ప్రజలు దీపావళి సమయంలో టపాసులు కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.