గోనె సంచులు నిల్వ చేసేందుకు గోడౌన్లు సిద్ధం: జేసీ
జంగారెడ్డిగూడెం మండలం కేతవరంలో రైతు సేవాకేంద్రాన్ని, జంగారెడ్డిగూడెంలోని విష్ణుప్రియ రైస్‌మిల్, ఎంఎల్ఎస్ పాయింట్‌ను బుధవారం జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణలో గోనె సంచులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. గోనె సంచులు నిల్వ చేసేందుకు గోడౌన్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.