జంగారెడ్డిగూడెం పట్టణంలోని టిడిపి కౌన్సిలర్ కరుటూరి రమాదేవి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పాల్గొని మాట్లాడారు. రానున్న రోజుల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అలాగే రాష్ట్రంలో గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో అథఃపాతాళానికి వెళ్ళిపోయిందన్నారు.