జంగారెడ్డిగూడెం: చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకండి
జంగారెడ్డిగూడెం పట్టణాన్ని సుందరీకరణ చేసేందుకు చర్యలు చేపట్టామని మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో మాట్లాడుతూ.. రోడ్డుకి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించేందుకు సిబ్బందికి తగు పరికరాలను అందజేశామన్నారు. వార్డులలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రజలు సహకరించి చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పారిశుధ్య కార్మికులకు అందించాలన్నారు.