లింగపాలెం: కొత్త మద్యం దుకాణం మూసివేత
లింగపాలెం గ్రామంలో ఇళ్ల మధ్య 51వ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారని గ్రామస్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే జిల్లా ఉన్నతాధికారులకు గురువారం ఫిర్యాదు చేశామని తెలిపారు. శుక్రవారం చింతలపూడి ఎక్సైజ్ సీఐ అశోక్ తన సిబ్బందితో ఇళ్లకు ఎదురుగా ఉన్న షాపును తాత్కాలికంగా మూసివేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు షాపుని మూసి వేశామన్నారు. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.