
నిడదవోలు: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై హర్షం
ఢిల్లీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందని పార్టీ పట్ట ణాధ్యక్షుడు మోర్త ప్రమోద్‌కుమార్ అన్నారు. శనివారం నిడదవోలులోని గణేష్‌చౌక్ సెంటరులో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో బీజేపీ విజయం నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి అని అన్నారు. కేజ్రీవాల్‌పై గెలుపొందిన సింగ్ వర్మకు శుభాకాంక్షలు తెలిపారు.