
ఏలూరు: ఘనంగా వీరభద్ర స్వామి కొలుపు
వీరభద్ర స్వామివారి చల్లని చూపుతో లోకమంతా ప్రశాంతంగా భాసిల్లాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు 48వ డివిజన్లో వీరుళ్ళ పండగలో భాగంగా ఆదివారం జరిగిన వీరభద్ర స్వామివారి కొలుపులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే భక్తిపూర్వకంగా ఘటాలను ధరించి, కొంతదూరం ఊరేగింపులో ముందుకు నడిచారు.