పాలకొల్లు - Palakollu

పాలకొల్లు లో ఘనంగా ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలు

పాలకొల్లు లో ఘనంగా ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలు

జగద్గురువు శ్రీ ఆదిశంకరుల 1236వ జయంతి వేడుకలు ఆదివారం ఉదయం 8:30 గంటలకు పాలకొల్లు లోని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం లో నందీశ్వరుని వద్ద ఉన్న ఆదిశంకరాచార్యులు విగ్రహం వద్ద జయంతి వేడుకలు శ్రీ క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం (ది. నెం. 319/2012) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, క్షీర రామలింగేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం కమిటీ సభ్యులు ఆది శంకరాచార్య విగ్రహం వద్ద పురోహితులు సుబ్బాయ్య సమక్షంలో పూజాదికాలు నిర్వహించి ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు సోమంచీ శ్రీనివాస శాస్త్రి, యర్రమిల్లి లక్ష్మీ నరసింహ రావు (వై. ఎన్. ఆర్), నరసింహ మూర్తి, నందుల దశరథ్, గోటేటి వేంకటేశ్వర రావు, కస్తూరి సుబ్బారావు, పోస్టల్ సూరి నారాయణ, బాలాజీ, జానకి రామయ్య, రమణ కుమార్, రాయవరపు సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా