అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
పెదపాడు మండలం వసంతాడ గ్రామంలో ఓ వివాహిత మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామానికి చెందిన అనిత అనే మహిళ తెల్లారేసరికి విగతజీవిగా మంచంపై పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమెతో సన్నిహితంగా ఉండే వ్యక్తి ఆమెను హత్య చేశాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.