ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొత్తూరులో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల భారీ వృక్షం శనివారం నేలకొరిగింది. ఈ సంఘటన చోటుచేసుకుంది. పెదపాడుకి రాకపోకలు కొంతమేర స్తంభించిపోయాయి. రెండువైపులా వాహనాలు బారులు తీరాయి. పెదపాడు నుంచి ఏలూరు వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెదపాడు పోలీసులు అధికారులు యంత్రాల సహాయంతో రోడ్డుకు అడ్డుగా ఉన్న వృక్షాన్ని తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు.