కనకాయలంక కాజ్వేను వరద ముంపు వీడటం లేదు
యలమంచిలి మండలం కనకాయలంక కాజ్వేను వరద ముంపు వీడటం లేదు. ఐదు రోజులుగా కాజ్వేపై వరద నీరు ప్రవహిస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం కొంచెం వరద నీరు తగ్గినా కాజ్వేపై రెండు అడుగుల ఎత్తులో ప్రవహిస్తుంది. అధికారులు పడవలను నిలిపివేయడంతో గ్రామస్తులు వరద నీటిలో వాహనాలపై, కాలినడకను రాకపోకలు సాగిస్తున్నారు. సోమవారం కాజ్వే పూర్తిగా ముంపు నుంచి బయటపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.