వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం ఎలమంచిలి మండలం బాడవ గ్రామంలో వరద బాధితులకు ప్రభుత్వం అందించే నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులు ఎవరు ఆందోళన చెందవలసిన పనిలేదు అన్నారు. ఈ కార్యక్రమంలో నరసాపురం టిడిపి ఇన్ ఛార్జ్ పొత్తూరి రామరాజు తదితరులు ఉన్నారు.