హిందూపురం నియోజకవర్గంలో అత్తా కోడలిపై గ్యాంగ్ రేప్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఈ ఘటనపై జిల్లా మంత్రి సవిత సాయంత్రానికల్లా నిందితులను అరెస్ట్ చేస్తామని ప్రకటించారన్నారు. అయితే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆచూకీ తెలియడం లేదని వైసీపీ నాయకులు టార్గెట్ చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణకు బాధితులను పరామర్శించే తీరిక లేదా అని నిలదీస్తున్నారు.