పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని గత ఎన్నికలలో నిరూపించారని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన పల్లె పండుగ వారోత్సవాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి ఎంపీ బాలశౌరి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే పల్లెల్లో అభివృద్ధి చూస్తున్నామన్నారు. మచిలీపట్నం, రేపల్లె రైల్వే ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజల కల సాకారం చేస్తామని ఎంపీ బాలశౌరి తెలిపారు.