రైళ్లలో ప్రజలతోనే పందులు, మేకల ప్రయాణం.. ఎక్కడంటే (వీడియో)

56చూసినవారు
భారతీయ రైల్వేలో ప్రయాణికులతో కుక్కలు, పిల్లులు, పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు కొన్ని షరతులతో అనుమతిస్తుంటారు. అయితే, చైనాలోని ఎంతో వెనుకబడిన ప్రాంతమైన డలియంగ్షాన్ ప్రాంతంలో నడిచే రైలులో ప్రజలతోపాటే కోళ్లు, మేకలు, పందులు ప్రయాణిస్తుంటాయి. మారుమూల పర్వత గ్రామాలను కలుపుతూ సాగే ఈ స్లో రైలులో రైతులు వీటిని మార్కెట్ కు తరలిస్తుంటారు. ట్రైన్ లోనే వీటిని కొందరు కొనుగోలు చేయడం గమనార్హం. ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్