జగన్ ఇటీవల పిఠాపురంలో పర్యటించారు. ఈ పర్యటనలో జగన్‌తో చాలా మంది నాయకులు ఉన్నారు. అయితే ఇంతమంది నేతలు వచ్చినా ఒ వ్యక్తి జాడ మాత్రం కనిపించలేదు. ఆయన ఎవరో కాదు గోదావరి జిల్లాలో బిగ్ ఫిగర్ పొలిటికల్ గా సీనియర్ అయిన ముద్రగడ పద్మనాభం. ఆయన జగన్ తో ఎందుకు కనిపించలేదు అన్న చర్చ సాగుతోంది. వైసీపీ ఓడాక ముద్రగడ ఒకటి రెండు సార్లు తాడేపల్లిలో కనిపించారు. జగన్‌తో కూడా మాట్లాడారు. ఆ తరువాత నుంచి ఆయన ఎందుకో సైలెంట్ అయ్యారు.