బెల్ట్ షాపులను క్లోజ్ చేయించిన టీడీపీ ఎమ్మెల్యే

82చూసినవారు
బెల్ట్ షాపులను క్లోజ్ చేయించిన టీడీపీ ఎమ్మెల్యే
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరులో హల్‌చల్ చేశారు. తిరువూరులోని వైన్ షాపుల పక్కన ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను దగ్గరుండి మరీ క్లోజ్ చేయించారు. నియోజకవర్గంలో ఉన్న బెల్ట్ షాపులను ఎక్సైజ్ శాఖ అధికారులు 24 గంటల్లో తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉదయం బెల్ట్ షాపులను స్వయంగా ఎమ్మెల్యే తనిఖీలు చేసి.. పోలీసులకు పట్టించారు. 130 పైగా బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్