కన్నడలో బిగ్ బాస్ రియాల్టీ షో ప్రారంభమైనప్పటి నుంచి దానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హీరో కిచ్చా సుదీప్ రాబోయే సీజన్స్‌కు తాను హోస్ట్‌గా చేయనని గతంలో ట్విట్టర్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సుదీప్ వివరణ ఇచ్చారు. ‘అక్కడ నేను ఎంత కష్టపడినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. ఇతర భాషల్లో బిగ్‌బాస్‌కు వచ్చినంత ఆదరణ, గుర్తింపు ఇక్కడ రావడం లేదు. దీనికి మరింత గౌరవం రావాలని తప్పుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు.