AP: తిరుపతిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తలతో నేడు పుంగనూరులో సమావేశానికి ఎంపీ మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే గొడవలు చెలరేగే అవకాశం ఉండటంతో సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినా సరే సమావేశం నిర్వహించేందుకు మిథున్ రెడ్డి ప్రయత్నం చేశారు. దీంతో ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.