స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, బీమా రక్షణ ఒకేచోట అందించేవి యూనిట్ ఆధారిత బీమా పాలసీలు. వీటి లాక్-ఇన్ వ్యవధి ఐదేళ్లు. సాధారణంగా ఇవి 15-20 ఏళ్ల దీర్ఘకాలిక పథకాలు. మీ వయసు, ప్రీమియం, వ్యవధి, వివిధ దశల్లో మీ అవసరాలు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని వీటిని ఎంపిక చేసుకోవాలి. పాలసీ వ్యవధి ముగిసే వరకూ ప్రీమియం చెల్లించాలి. దీనిపై సెక్షన్ 80సి కింద మినహాయింపు పొందొచ్చు. మెచ్యూరిటీ సమయంలో ఐటీ చట్టంలోని సెక్షన్ 10(10డి) కింద అసలు, రాబడి కూడా పన్ను రహితం.