వైఎస్ ఆస్తులను ప్రజలకు పంచాలి: మంత్రి ఆనం

53చూసినవారు
వైఎస్ ఆస్తులను ప్రజలకు పంచాలి: మంత్రి ఆనం
YS ఆస్తుల వ్యవహారంలో వైఎస్ జగన్, షర్మిల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. కుటుంబ సమస్యను రాజకీయ సమస్యగా మార్చారని మండిపడ్డారు. తల్లి, కూతురు, కొడుకు ఆస్తుల గొడవ అని, ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదని చెప్పారు. ఆ ముగ్గురి అక్రమ సంపద ప్రజలకు పంచాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తులను ప్రజలకు పంచాలని కేంద్రానికి మంత్రి ఆనం విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్