AP: వైఎస్సార్ జిల్లా పులివెందుల పర్యటనలో భాగంగా మాజీ సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. జగన్‌ను కలిసేందుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. గుత్తేదారులు వైసీపీ హయాంలో చేపట్టిన పనుల తాలూకు బిల్లుల గురించి అడిగారు. దాంతో జగన్ అసహనం వ్యక్తం చేస్తూ.. ఇప్పుడు కూడా బిల్లులు అడుగుతారేంటని చికాకుపడ్డారు. మరోవైపు జగన్‌కు కలిసేందుకు కొందరు కార్యాలయంలోకి దూసుకొచ్చారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది.