మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన అనారోగ్యంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహానికి శనివారం అంత్యక్రియలు జరుగుతాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని మీడియాకు తెలిపారు.